AUS vs SA: రేపటి నుంచే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు

AUS vs SA: రేపటి నుంచే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ నెలలో ఇండియా మ్యాచ్ లు లేకపోయినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం (ఆగస్టు 10) నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. మొదట టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10 నుంచి 16 వరకు టీ20 సిరీస్.. ఆగస్టు 19 నుంచి 24 వరకు వన్డే సిరీస్ జరగనుంది. మ్యాచ్ లన్నీ ఆస్ట్రేలియాలోని డార్విన్, కైర్న్స్, మెకే వేదికలుగా జరుగుతాయి. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ కు ఈ సిరీస్ ఇరు జట్లకు బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత పూర్తి స్థాయి జట్టుతో సౌతాఫ్రికా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇటీవలే వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 5-0 తేడాతో గెలిచి ఊపు మీద కనిపిస్తోంది. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టును మిచెల్ మార్ష్ కెప్టెన్సీ చేయనున్నాడు. పని భారం కారణంగా పాటు కమ్మిన్స్ కు ఈ సిరీస్ లో రెస్ట్ లభించింది. మరోవైపు సౌతాఫ్రికా టీ20 జట్టును మార్కరం, వన్డే జట్టును బవుమా నాయకత్వం వహించనున్నారు. 

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 షెడ్యూల్:
  
ఆదివారం, 10 ఆగస్టు 2025

మొదటి టీ20 మ్యాచ్ – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా

మర్రారా స్టేడియం, డార్విన్

మంగళవారం, 12 ఆగస్టు 2025

రెండవ టీ20 మ్యాచ్ - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా

మర్రారా స్టేడియం, డార్విన్

శనివారం, 16 ఆగస్టు 2025

మూడో టీ20 మ్యాచ్ – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా

కాజాలిస్ స్టేడియం, కైర్న్స్
 
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..? 
      
ఇండియాలో స్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్ లైన్ లో ఈ సిరీస్ ను  జియోహాట్‌స్టార్, వెబ్‌సైట్‌లో లైవ్ చూడొచ్చు. 

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా వన్డే, టీ20 జట్లు:

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ , మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: 

ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుసామి, లుంగి న్గిడి, న్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడా , ట్రియాన్ స్టిబ్స్, రియాన్‌లాన్ రికెల్బ్స్, ప్రెనెండర్ రికెల్బ్స్ డస్సెన్

దక్షిణాఫ్రికా వన్డే జట్టు:

టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎన్గిడి, లువాన్-డ్రే ప్రెటోరియస్, ర్యాన్-డ్రే ప్రెటోరియస్, సెయింట్ రౌస్టన్, ఆర్. ప్రేనెలన్ సుబ్రాయెన్

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ , బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, లాన్స్ మోరిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా