కేన్ తప్పిదం..సిక్స్ కొట్టి నోబాల్ అంటూ అప్పీల్..

కేన్ తప్పిదం..సిక్స్ కొట్టి నోబాల్ అంటూ అప్పీల్..

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ..విజయంతో వన్డేలకు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్తో జరిగిన లాస్ట్ వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగులతో తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసీస్ టీమ్ సభ్యులు తమ కెప్టెన్కు విజయంతో  ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే చివరి వన్డేలో ఫించ్ విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులే చేశాడు. 

క్లీన్ స్వీప్..
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గిన ఆస్ట్రేలియా..ఆదివారం చివరి వన్డే ఆడింది. ఇందులో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారులు..50 ఓవర్లలో 5 వికెట్లకు 267 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించగా..లబుషేన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అలెక్స్ క్యారీ 42 పరుగులు, కామెరూన్ గ్రీన్ 25 పరుగులు చేశారు. ఆ తర్వాత 268 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 49.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయింది.  గ్లేన్ ఫిలిప్స్47 రన్స్, జేమ్స్ నీషమ్36 పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. 

కేన్ విలిమ్సన్ తప్పిదం..
చివరి వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన తప్పిదంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్ సెట్ చేయడంతో అతను ఘోర తప్పిదం చేశాడు. టెన్షన్ మ్యాచ్‌లోనైనా కూల్గా ఉండే కేన్..మిస్టేక్ చేసి..ఆస్ట్రేలియాకు అదనపు పరుగులు వచ్చేలా చేశాడు. వన్డే నిబంధనల ప్రకారం 40 ఓవర్లకు ముందు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ కేన్  విలియమ్సన్ ఈ విషయం మరిచి సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను ఉంచాడు. జేమ్స్ నీషమ్ వేసిన 38వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీన్ని గమనించిన స్మిత్.. సిక్స్ కొట్టి నోబాల్ అంటూ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఫీల్డర్లను లెక్కపెట్టి మరి చెప్పాడు. దాంతో అంపైర్లు నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చారు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అయ్యింది.