వన్డేలకు ఫించ్ గుడ్ బై

వన్డేలకు ఫించ్ గుడ్ బై

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టీ20ల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే త్వరలో సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..ఈ టోర్నీ తర్వాత టీ20ల నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఫించ్..న్యూజిలాండ్తో ఆదివారం జరగనున్న వన్డేనే చివరిది కానుంది. 

ఫించ్ వన్డే కెరీర్ .
2013లో శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా ఈ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫించ్..10 ఏళ్ల కెరీర్లో 145 మ్యాచులు ఆడాడు. 5401 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 2015లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2020లో ఆస్ట్రేలియా మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్​ తర్వాత ఆస్ట్రేలియా తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడుగా ఆరోన్ ఫించ్ నిలిచిపోయాడు.

వైఫల్యంతోనే నిర్ణయం.. 
సారథిగా టీమ్ను గెలిపిస్తున్న ఫించ్‌.. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. చివరి 7 వన్డేల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండుసార్లు డకౌట్స్ ఉన్నాయి. ఫించ్‌ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను నెగ్గింది. 2018లో వన్డే, టి20 ఫార్మాట్లలో ఆస్ట్రేలియా కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు.