ఇండియన్‌ డిసేబుల్డ్‌‌ ​క్రికెటర్లకు ఆసీస్‌ సాయం

ఇండియన్‌ డిసేబుల్డ్‌‌ ​క్రికెటర్లకు ఆసీస్‌ సాయం

ముంబై: ఇండియాలో క్రికెటర్లు కాస్త గుర్తింపు తెచ్చుకుంటే చాలు.. పురుషులు అయిన, మహిళలు అయినా ఆర్ధికంగా ఢోకా ఉండదు. కానీ అంధ క్రికటర్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. వారు ఎన్ని ఘనతలు సాధించినా తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కూడా వారు అంతంత మాత్రమే. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం క్రికెట్ యాక్టివిటీ నిలిచిపోవడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే ఈ క్రికెటర్లను ఆదుకునేందుకు ఇండియాలో ఎవ్వరు ముందుకురాలేదు.

కానీ ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మాత్రం పెద్ద మనసు చాటుకున్నారు. వీరు చేసిన ఆర్థిక సాయంతో 100 మంది డిసేబుల్డ్‌ క్రికెటర్ల కు రూ.5000 చొప్పున అందిస్తున్నామని ఫిజికల్లీ చాలెంజ్డ్​ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీసీసీఏఐ) సెక్రటరీ రవి చౌహన్ గురువారం తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన హార్లీ మెడ్ కాఫ్, ఆనంద్ చుక్కా, నల్లా ప్రవీణ్ తమకు సాయం అందించారని చెప్పారు. వీరిలో మెడ్ కాఫ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కు మేనేజర్ గా పని చేస్తున్నాడు. సాయం చేసిన ముగ్గురితో పాటు స్టీవ్ వా కు కూడా పీసీసీఏఐ ధన్యవాదాలు తెలియజేసింది.