WTC FINAL: 5 వికెట్లతో చెలరేగిన రబాడ.. తక్కువ స్కోర్‎కే ఆస్ట్రేలియా ఆలౌట్

WTC FINAL: 5 వికెట్లతో చెలరేగిన రబాడ.. తక్కువ స్కోర్‎కే ఆస్ట్రేలియా ఆలౌట్

లండన్: ఇంగ్లాండ్‎లోని లార్డ్స్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్సింగ్స్‎లో బ్యాటింగ్‎లో ఆస్ట్రేలియా తడబడింది. సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ రబాడ దెబ్బకు 212 పరుగులకు ఆసీస్ చాపచుట్టేసింది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‎స్టర్ (72) తప్ప మిగిలిన అందరూ విఫలం కావడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. మార్కో యాన్సెన్ 3 వికెట్లతో రాణించగా.. కేశవ్ మహారాజ్, మార్కక్రమ్ చెరో వికెట్ తీశారు

ALSO READ | WTC FINAL: ఫస్ట్ సెషన్‎లోనే కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో కంగారులు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా సరైన శుభారంభం దక్కలేదు. ఫుల్ ఫామ్ లో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమి చేయడకుండానే రబాడ బౌలింగ్‎లో వెనుదిరిగాడు. ఓపెనర్ గా ప్రమోట్ అయిన మార్నస్ లబుషేన్ (17) కూడా నిరాశ పర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ 4, ట్రావిస్ హెడ్ 13 పరుగులు మాత్రమే చేసి వెనువెంటనే పెలిలియన్ చేరారు. 

ఈ దశలో స్టీవ్ స్మిత్, బ్యూ వెబ్‎స్టర్ వికెట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆసీస్ ఇన్సింగ్స్‎ను ముందుకు తీసుకెళ్లారు. టీ బ్రేక్ తర్వాత మరోసారి సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో స్టీవ్ స్మిత్ (66) , బ్యూ వెబ్‎స్టర్ (72) హాఫ్ సెంచరీలు చేసి ఔట్ అయ్యారు. చివర్లో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. క్యారీ ఔట్ కాగానే వెను వెంటనే వికెట్లు పడటంతో ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

మరిన్ని వార్తలు