WTC FINAL: ఫస్ట్ సెషన్‎లోనే కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో కంగారులు

WTC FINAL: ఫస్ట్ సెషన్‎లోనే కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో కంగారులు

లండన్: ఇంగ్లాండ్‎లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‏కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‎లో తడబడుతోంది. సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో ఫస్ట్ సెషన్‎లోనే ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. 75 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. 

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ మార్నస్ లబుషేన్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. మార్కో యాన్సెన్ వేసిన అద్భుత బంతికి లబుషేన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‎లో బ్యాటింగ్ దిగిన కామెరూన్ గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి  పూర్తిగా నిరాశ పర్చాడు. 

ALSO READ | WTC ఫైనల్‎లో దుమ్మురేపుతోన్న రబాడ.. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్

అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ 11 రన్స్ చేసి మార్కో యాన్సెన్ బౌలింగ్‎లో వెర్రెయిన్నే పట్టిన అద్భుతమైన క్యాచ్‎కి వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఫస్ట్ సెషన్లోనే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 27 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (40), బ్యూ వెబ్‎స్టర్ (1) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, మార్కో యాన్సెన్ చెరో రెండు వికెట్లు తీసి కంగారులను దెబ్బకొట్టారు. ప్రస్తుతం ఆసీస్ ఆశలన్నీ స్టీవ్ స్మిత్‎పైనే ఉన్నాయి.  

జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ(కెప్టెన్), పాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్