ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆరోన్ ఫించ్ సెంచరీ, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా గౌరవప్రద స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి.. 285 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఫించ్ 100, వార్నర్ 53, స్మిత్ 38, అలెక్స్ కేరీ 38 ఎక్కువ రన్స్ రాణించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో వోక్స్ రెండు, ఆర్చర్, వుడ్, స్టోక్స్, మొయిన్ తలో వికెట్ తీశారు.
Australia finish their innings with 285/7.
Who will be the happier of the two sides?#ENGvAUS | #CWC19 pic.twitter.com/ItqJoje2cK
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
