హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఉత్సాహాన్ని నింపుతోంది. తొలిదశలో భాగంగా 9 జిల్లాల్లోని 1,800 బడుల్లో 1.8 లక్షల మంది విద్యార్థులతో పాటు 3,500 మంది టీచర్లు ప్రతిరోజూ స్కూల్ లోనే టిఫిన్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.23 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి ఈ పథకం ద్వారా అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ఈ స్కీమ్ అమలు లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో అమలైతే మొత్తం 20.60 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. మెనూ ప్రకారం.. దోశ, ఇడ్లీ, పూరీ వంటి వెరైటీలతో పాటు వారంలో మూడ్రోజులు చిన్న పిల్లలకు 100 ఎంఎల్, పెద్ద పిల్లలకు 150 ఎంఎల్ పాలు ఇస్తున్నారు.పాలు లేని రోజుల్లో రాగిజావ, మధ్యాహ్నం గుడ్లుఅందిస్తున్నారు.
