Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా.. తొలి మ్యాచుకు గిల్ దూరం 

Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా.. తొలి మ్యాచుకు గిల్ దూరం 

వరల్డ్ కప్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు లీగ్ మ్యాచుల్లో 8 జట్లు తమ తొలి మ్యాచ్ ఆడేయగా.. భారత్-ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగా ఆల్ రౌండర్ స్టాయ్ నీస్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. మరోవైపు భారత జట్టులో ఓపెనర్ గిల్ డెంగ్యూ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్ ని ఓపెనర్ గా తీసుకున్నారు.  

భారత్ తుది జట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్) , హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా తుది జట్టు:

డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.