IndvsAus: తడబడిన టాపార్డర్..91 కే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్

IndvsAus: తడబడిన టాపార్డర్..91 కే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాపార్డర్ తడబడింది.  డ్రింక్స్ వరకు నిలకడగా ఆడిన ఆసీస్ ..డ్రింక్స్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ వార్నర్ ఫస్ట్ వికెట్గా నిష్క్రమించాడు. షమీ బౌలింగ్లో బంతిని బ్యాక్‌ఫుట్‌లో డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. 

అశ్విన్ అదుర్స్..

ఈ సమయంలో  మరో ఓపెనర్ ఖవాజా, లబూషేన్ కొద్దిసేపు జాగ్రత్తగా ఆడారు. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు బోర్డును నడిపించారు. రెండో వికెట్కు 40 పరుగులు జోడించారు. అయితే ఈ స్థితిలో వీరి జోడిని అశ్విన్ విడగొట్టాడు. 18 పరుగులు చేసిన లబూషేన్ను LBWగా పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ ను డకౌట్ చేయడంతో..ఆస్ట్రేలియా 91 పరుగుల వద్దే రెండు వికెట్లు నష్టపోయింది. 

ఖవాజా 50

ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఉస్మాన్ ఖవాజా భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. క్రీజులో పాతుకుపోయి ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో 71 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 94 పరుగులు చేసింది. క్రీజులో ఖవాజా (50), టి హెడ్ (1) పరుగులతో ఉన్నారు.