స్టేడియంలో డ్రింక్స్ అందించిన ప్రధాని

స్టేడియంలో డ్రింక్స్ అందించిన ప్రధాని

ప్రధాని హోదాలో ఉండి డ్రింక్స్ మెన్ గా మారాడు. అందరిచేత వాహ్ అనిపించుకుంటున్నాడు. అతడే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య 3టీ20ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే గురువారం ఈ రెండు టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. ఆట మధ్యలో క్రికెటర్ కు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అందించి షాక్ ఇచ్చాడు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. నార్మల్ గా డ్రింక్స్ బ్రేక్ టైంలో స్టేడియం సిబ్బంది, మిగతా ప్లేయర్లు వాటర్ తెస్తారు. కానీ దేశ ప్రధాని అయి ఉండి వాటర్ తేవడంతో ఒక్కసారిగా స్టేడియంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.

కాన్బెర్రాలోని ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఆస్ట్రేలియా ప్రధాని ఒక్కసారిగా గ్రౌండ్ లోకి పరుగెత్తుకు వచ్చారు. ఆసీస్ క్రికెట్ టీమ్ క్యాప్ ధరించి మైదానంలోకి వచ్చిన ప్రధాని మ్యాచ్ తర్వాత 2 టీమ్స్ తో గ్రూప్ ఫొటో దిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.