చెలరేగిన వార్నర్, ఖవాజా : బంగ్లాదేశ్ టార్గెట్ 382

చెలరేగిన వార్నర్, ఖవాజా : బంగ్లాదేశ్ టార్గెట్ 382

నాటింగ్ హామ్ : వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీస్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ భారీ సెంచరీ , ఖవాజా భారీ అర్ధసెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు పరుగులెత్తింది. బంగ్లాదేశ్ కు 382 పరుగుల టార్గెట్ పెట్టింది

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెరన్లు డేవిడ్ వార్నర్ , కెప్టెన్ ఫించ్ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 121 రన్స్ భాగస్వామ్యం అందించాక ఫించ్(53) ఔటయ్యాడు. ఖవాజాతో కలిసి బంగ్లాదేశ్ ఫీల్డర్లు, బౌలర్లకు చెమటలు పట్టించాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే వార్నర్ కెరీర్ లో 16వ సెంచరీ పూర్తిచేశాడు వార్నర్ 112 బాల్స్ లో సెంచరీ దాటాడు. ఈ వరల్డ్ కప్ లో వార్నర్ కు ఇది రెండో సెంచరీ. మరోఎండ్ లో ఖవాజా(89) కూడా చక్కటి సహకారం అందించాడు. 147 బాల్స్ లో 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 166 రన్స్ చేసి సౌమ్య సర్కార్ బౌలింగ్ లో ఔటయ్యాడు డేవిడ్ వార్నర్.

44.2 ఓవర్ దగ్గర ఆస్ట్రేలియా స్కోరు 313  పరుగులుగా ఉన్నప్పుడు రెండో వికెట్(వార్నర్) పడింది. 2వ వికెట్ కు వార్నర్, ఖవాజా ఇద్దరూ 192 రన్స్  జోడించారు. ఆ తర్వాత.. కేవలం 34 బంతుల్లోనే 68 రన్స్ జోడించారు కంగారూ ఆటగాళ్లు. మాక్స్ వెల్ 10 బాల్స్ లో 3 సిక్సులు, 2 ఫోర్లతో 32 రన్స్ కొట్టాడు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగుల స్కోరు సాధించింది ఆస్ట్రేలియా.

బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1 వికెట్ పడగొట్టారు.