మొహాలీ చేరుకున్న టీమిండియా

మొహాలీ చేరుకున్న టీమిండియా

మొహాలీ: ఇండియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆస్ట్రేలియా ప్రాక్టీస్‌‌‌‌ షురూ చేసింది. శనివారం మొహాలీ స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో కంగారూ ప్లేయర్లంతా చెమటోడ్చారు. గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ స్విచ్‌‌‌‌ హిట్‌‌‌‌ షాట్లు ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూ కనిపించాడు. అతనితో పాటు కెప్టెన్‌‌‌‌ ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌, సీనియర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ నెట్స్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేశారు. స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌, ఇతర బౌలర్లు వాళ్లకు బంతులు వేశారు. మరోవైపు ఈ నెల 20న జరిగే తొలి టీ20 కోసం టీమిండియామొహాలీ చేరుకుంది. ఆసియా కప్‌‌‌‌ తర్వాత స్వస్థలాలకు వెళ్లిన ప్లేయర్లు బ్యాచ్‌‌‌‌ల వారీగా వచ్చారు. కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ, హార్దిక్‌‌‌‌ పాండ్యా, సూర్యకుమార్‌‌‌‌,  హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌, కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ ఎయిర్​పోర్టు నుంచి హోటల్​ చేరుకున్నారు.  ఇండియా ప్లేయర్లు ఆదివారం మధ్యాహ్నం తొలి ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో పాల్గొంటారు.