
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా అండర్--–-19 జట్టుతో తొలి యూత్ టెస్టులో ఇండియా అండర్–-19 టీమ్ అదరగొడుతోంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (86 బాల్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 113), వేదాంత్ త్రివేది (140) సెంచరీలతో జట్టుకు బలమైన పునాది వేశారు. రెండో రోజు, బుధవారం సూర్యవంశీ టీ20 తరహాలో విధ్వంసం సృష్టించగా, వేదాంత్ నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా–ఎ 81.3 ఓవర్లలో 428 రన్స్‌కు ఆలౌటైంది. ఫలితంగా 185 రన్స్ భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8/1తో నిలిచింది. ఇండియా స్కోరుకు ఇంకా 177 రన్స్ దూరంలో ఉంది.