వరుసగా 21 మ్యాచులు గెలిచిన ఆసీస్ మహిళా జట్టు

వరుసగా 21 మ్యాచులు గెలిచిన ఆసీస్ మహిళా జట్టు

ఆసీస్​ మహిళల రికార్డు విక్టరీ

కివీస్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌ 3-0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

బ్రిస్బేన్‌‌‌‌: వన్డే క్రికెట్‌‌‌‌లో వరుసగా 21 విక్టరీలతో రికీ పాంటింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ కో  2003లో నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియా మహిళల జట్టు సమం చేసింది. న్యూజిలాండ్‌‌‌‌ మహిళలతో బుధవారం జరిగిన మూడో వన్డేలో 232 రన్స్‌‌‌‌ భారీ తేడాతో గెలిచిన ఆసీస్‌‌‌‌ అమ్మాయిలు ఈ ఫీట్‌‌‌‌ చేశారు. 21వ విక్టరీతోపాటు మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 3–0తో క్వీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేశారు. అంతేకాక న్యూజిలాండ్‌‌‌‌పై అతిపెద్ద విక్టరీ సాధించారు. ఈ మ్యాచ్​లో టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఆసీస్​ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 325 రన్స్‌‌‌‌ చేసింది. స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రేచల్‌‌‌‌ హేన్స్‌‌‌‌(96) , హీలీ(87) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేశారు. కివీస్‌‌‌‌ బౌలర్లలో కెర్‌‌‌‌(3/50)కు మూడు వికెట్లు  తీసింది. భారీ ఛేజింగ్‌‌‌‌లో  27 ఓవర్లు ఆడిన కివీస్​ 93కే ఆలౌటైంది. సాటర్త్‌‌‌‌వైట్‌‌‌‌(41) టాప్​ స్కోరర్​. సదర్‌‌‌‌ల్యాండ్‌‌‌‌(2/25), జెనాసన్‌‌‌‌(2/16), గార్డెనర్‌‌‌‌(2/11), మొలినిక్స్‌‌‌‌(2/2) తలో రెండేసి వికెట్లు తీశారు.

For More News..

నేడు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి