సెకండ్ ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా స్మాష్..2-0తో సిరీస్ ఆసీస్ వశం

సెకండ్ ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా స్మాష్..2-0తో సిరీస్ ఆసీస్ వశం

మెల్ బోర్న్ టెస్టులో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో చిత్తయిన సౌతాఫ్రికా..రెండో టెస్టులోనూ ఓడిపోయి..సిరీస్ ను కోల్పోయింది. మొత్తంగా మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో దక్కించుకుంది. 

ఐదేసిన గ్రీన్..

ఈ టెస్టులో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులకే ఆలౌట్ అయింది. వీరన్నే, మార్కో జాన్సెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 5 వికెట్లు తీసుకోగా..మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్, నాథన్ లియన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

వార్నర్ డబుల్..

ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 575/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.డేవిడ్ వార్నర్ (255 బంతుల్లో 200 పరుగులు 16 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (111) సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (85), ట్రావిస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో  ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 386 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

సౌతాఫ్రికా ఫసక్..

ఇక  రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా మరోసారి తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరింది. ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 204 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెంబా బవుమా (144 బంతుల్లో 65 పరుగులు  6 ఫోర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరన్నే (33), డి బ్రయన్ (28), సరెల్ ఎర్వీ (21) పర్వాలేదనిపించారు.  కెప్టెన్ డీన్ ఎల్గర్ డకౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియన్ మూడు వికెట్లు దక్కించుకోగా.. స్కాట్ బోలాండ్ రెండు వికెట్లను సాధించాడు. స్టార్క్,  కమిన్స్, స్టీవ్ స్మిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు.