
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ 2023లో భాగంగా నాగ్ పూర్ లో మొదలైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ లు అరంగేట్రం చేశారు. శుభ్ మన్ గిల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు.
ఆస్ట్రేలియా తుది జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్
టీమిండియా తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్