
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ఢిల్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు స్వల్ప మార్పులతో ఈ మ్యాచులో బరిలోకి దిగాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అటు ఆస్ట్రేలియా మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ ను జట్టులోకి తీసుకుంది. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ కు ప్లేస్ దక్కింది.
టీమిండియా తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ ( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్( కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమాన్.