వన్డేల్లో 200 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌

 వన్డేల్లో 200 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్  మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు.  వన్డేలో ఎవరికి సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో 200వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో స్టార్క్ ఈ ఘనతను  అందుకున్నాడు. జింబాబ్వే ప్లేయర్ రియాన్‌ బర్ల్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. 

పాక్ బౌలర్ రికార్డు బద్దలు
మిచెల్ స్టార్క్  కేవలం 102 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతకుముందు పాక్  మాజీ బౌలర్‌ సక్లైన్ ముస్తాక్ 104 మ్యాచ్‌ల్లో 200వికెట్లు తీశాడు. ముస్తాక్ రికార్డును ప్రస్తుతం స్టార్క్ బద్ధలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100వికెట్లు పడగొట్టిన బౌలర్గానూ స్టార్క్‌ ఘనత సాధించాడు.

స్టార్క్‌దే అగ్రస్థానం
అత్యంత వేగంగా 200వికెట్ల మైలురాయి అందుకున్న ప్లేయర్లలో స్టార్క్ 102 మ్యాచ్‌లతో తొలిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ముస్తాక్ 104మ్యాచ్‌లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ 112మ్యాచ్‌లతో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.  సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ డొనాల్డ్ 117 మ్యాచ్‌లతో ఫోర్త్ ప్లేస్,  పాక్ మాజీ బౌలర్ యూనుస్ 118మ్యాచ్‌లతో టాప్ 5 లో ఉన్నారు. బంతుల పరంగా చూసుకున్న స్టార్క్ 5240 బాల్స్ తో  వేగంగా 200 వికెట్లు సాధించాడు. అతని తర్వాత సక్లైన్ ముస్తాక్ 5457 బంతులు, బ్రెట్ లీ 5640 బంతులు, వకార్ యూనిస్ 5883 బంతులు, షోయాబ్ అక్తర్ 6102 బంతులతో టాప్ 5లో ఉన్నారు.