
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ గౌరవ్ కుందీ (42) మెడపై ఓ పోలీసు అధికారి మోకాలితో తొక్కడంతో అతను చనిపోయాడు. గురువారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆడిలైడ్ లోని మాడ్ బరీ నార్త్ కు చెందిన గౌరవ్ తన భార్యతో కలిసి వెళుతుండగా రాయ్ స్టన్ పార్క్ సమీపంలోని పేనెహాం రోడ్ లో ఓ మహిళతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గౌరవ్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా తన తప్పేమీ లేదని అతను తెలిపాడు.
దీంతో ఓ పోలీసు అధికారి గౌరవ్ మెడపై మోకాలితో తొక్కాడు. క్రూరంగా ప్రవర్తించవద్దని బాధితుడి భార్య అమృత్ పాల్ వేడుకున్న పోలీసులు కనికరించలేదు. దీంతో బాధితుడు స్పృహ కోల్పోగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.