ఆస్ట్రియాలో ఓ పెద్దాయన ఎడమ కాలును తొలగించాల్సి ఉండగా, డాక్టర్ పొరపాటున కుడి కాలును తీసేసింది. దీంతో ఆ డాక్టర్‌కు కోర్టు చీవాట్లు పెట్టి, ఫైన్ వేసింది. ఫ్రీస్టాడ్ టౌన్లో 82 ఏండ్ల పెద్దాయన ఎడమ కాలు సమస్యతో క్లినిక్‌కు వెళ్లాడు. ఏమరుపాటులో డాక్టరమ్మ ఎడమ కాలుకు బదులు కుడి కాలును తొలగించింది. సర్జరీ అయ్యాక రెండ్రోజులకు విషయం తెల్వడంతో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పొరపాటైందని సారీ చెప్పింది. కొన్నిరోజుల తర్వాత ఆ రోగి చనిపోగా.. అతని భార్య డాక్టర్ నిర్వాకంపై కోర్టుకెళ్లింది. దీంతో రూ. 2.30 లక్షల ఫైన్ కట్టాలని, మృతుడి భార్యకు రూ.4.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది.
