AUSvs WI: స్మిత్,లబుషేన్ డబుల్ సెంచరీల మోత

AUSvs WI: స్మిత్,లబుషేన్ డబుల్ సెంచరీల మోత

ఫెర్త్ లో వెస్టిండీస్ తో జరుగుతోన్న ఫస్ట్  టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోర్  తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన  ఆసిస్  4 వికెట్ల నష్టానికి 598 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్, లబుషేన్ డబుల్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది.

ఓపెనర్లు  వార్నర్ 5, ఖవాజే 65 పరుగులతో విఫలమైనా..తర్వాత వచ్చిన లబుషేనే 350 బంతుల్లో 204, స్టీవ్ స్మిత్ 200 నాటౌట్ తో చెలరేగారు.   స్మిత్‌కు టెస్టుల్లో 29వ సెంచరీకాగా.. ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. మరో వైపు హెడ్ 99 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 598 పరుగుల వద్ద ఆసిస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్..రెండో రోజు ఆటముగిసే సమయానికి 23 ఓవర్లలో 74 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇంకా 524 పరుగుల వెనుకంజలో ఉంది