
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు సప్లయ్ చేస్తున్న తాగునీటిని వృథా చేసిన మహిళకు అధికారులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఈ నెల 5న ఇలాగే జూబ్లీహిల్స్ లోని ఇంటి ముందు నల్లా నీటితో బైక్వాష్చేసిన వ్యక్తికి రూ.వెయ్యి ఫైన్వేశారు.
తాజాగా జూబ్లీహిల్స్జర్నలిస్టు కాలనీలోని ఇంట్లో నల్లా తిప్పి వదిలేయడంతో నీరంతా వృథాగా పోయింది. రోడ్డుపై నీరు పారడాన్ని గుర్తించిన స్థానికులు వాటర్‌బోర్డు కస్టమర్ కేర్ కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. ఓఅండ్ఎం డివిజన్-–6 జీఎం హరిశంకర్ తన మేనేజర్ తో కలిసి తనిఖీ చేయగా, యరత శోభ అనే మహిళ ఇంట్లోని నల్లా తిప్పి వదిలేసిందని గుర్తించారు. ఆమెకు రూ.1000 ఫైన్ వేశారు.