సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్
  • ఆస్తి పన్ను బకాయిలపై భారీ రాయితీ

పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారుల కోసం అధికారులు వన్ టైమ్ సెటిల్​మెంట్(ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. కంటోన్మెంట్స్ చట్టం-2006 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది. వడ్డీ మొత్తం రూ. 10 వేల లోపు ఉంటే దానిని పూర్తిగా మినహాయిస్తారు. 

ఒకవేళ వడ్డీ రూ. 10 వేలకు పైగా ఉంటే అందులో 30 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఈ రాయితీ కేవలం వడ్డీ మొత్తానికే వర్తిస్తుందని, దీనిని పొందాలనుకునే వారు అసలు బకాయిలతో సహా మొత్తం ఆస్తి పన్నును నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలు ఉన్న ఆస్తి యజమానులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది.