సర్జికల్ స్ట్రైక్ 2..ఆటో డ్రైవర్ ఫ్రీ రైడ్

సర్జికల్ స్ట్రైక్ 2..ఆటో డ్రైవర్ ఫ్రీ రైడ్

ఢిల్లీ : బాలాకోట్ విజయంతో ఉప్పొంగిపోయిన ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులకు ఉచిత ప్రయాణాన్ని ఆఫర్ చేశాడు. ఢిల్లీలో మనోజ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులకు ఫ్రీ రైడ్ కల్పించాడు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ కు బదులు చెప్పినందుకు ఆటోలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తున్నట్లు మనోజ్ తన ఆటో పై పోస్టర్లు  అతికించారు. భారత సైన్యం దాడుల నేపథ్యంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు ఆటో  డ్రైవర్.