ప్రీతిస్మిత రికార్డు గోల్డ్

ప్రీతిస్మిత రికార్డు గోల్డ్

లిమా (పెరూ) : ఇండియా వెయిట్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌ ప్రీతిస్మితా భోయి.. ఐడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ యూత్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ రికార్డుతో గోల్డ్ మెడల్‌‌‌‌ గెలిచింది. బుధవారం రాత్రి  జరిగిన విమెన్స్‌‌‌‌ 40 కేజీల్లో ప్రీతి మొత్తం 133 (స్నాచ్‌‌‌‌ 57, క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌ 76) కేజీల బరువు ఎత్తి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఈ క్రమంలో క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌లో గత వరల్డ్‌‌‌‌ రికార్డు (75 కేజీ)ను బ్రేక్‌‌‌‌ చేసింది. ఓవరాల్‌‌‌‌గా యూత్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ స్టాండర్డ్స్ కంటే 2 కేజీల బరువు ఎక్కువ ఎత్తడం విశేషం.

ఇండియాకే చెందిన జోష్న సాబర్‌‌‌‌ 125 (56+69) కేజీలతో సిల్వర్‌‌‌‌ సాధించింది. ఫాతిమా కోల్కాక్‌‌‌‌ (120 కేజీ, టర్కీ) బ్రాంజ్‌‌‌‌ను కైవసం చేసుకుంది. విమెన్స్‌‌‌‌ 45 కేజీల్లో పాయల్‌‌‌‌ 147 (65+82) కేజీల బరువు ఎత్తి రెండో ప్లేస్‌‌‌‌తో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకోగా, మెన్స్‌‌‌‌ 49 కేజీల్లో బాబులాల్‌‌‌‌ హెంబ్రోమ్‌‌‌‌ 193 (86+107) కేజీలతో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌  సాధించాడు.