రైజర్స్ x రాయల్స్‌‌‌‌‌‌‌‌ ..ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరేదెవరు?

రైజర్స్ x రాయల్స్‌‌‌‌‌‌‌‌ ..ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరేదెవరు?
  • నేడు క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌2              
  • రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్ ఢీ

చెన్నై : తమ పవర్ హిట్టింగ్‌తో  లీగ్ దశను రెండో  ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ముగించి తొలి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోల్తా కొట్టిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–17లో ఫైనల్ చేరేందుకు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో  రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.  అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో కేకేఆర్ చేతిలో ఓటమి నుంచి వెంటనే తేరుకొని రాయల్స్ పనిపట్టాలని చూస్తోంది.

మరోవైపు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ చేరుకున్న  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని ఎలిమినేట్ చేసిన రాజస్తాన్ సైతం ఫైనల్‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో  సన్ రైజర్స్ పవర్ హిట్టర్లకు.. రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లకు మధ్య అసక్తికర పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పోరులో నెగ్గిన జట్టు చెన్నైలోనే ఆదివారం జరిగే ఫైనల్లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడతుంది.

‘ట్రావిషేక్’ హిట్టయితేనే

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ తమ ఓపెనర్లు ట్రావిస్ హెడ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్ శర్మ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఫ్యాన్స్ ‘ట్రావిషేక్‌‌‌‌‌‌‌‌’ అని పిలుచుకుంటున్న ఈ ఇద్దరూ పవర్ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ను మరో లెవెల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. హెడ్ (199.62 రన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 533 రన్స్‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌ (207 రన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 470 రన్స్) కలిసి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 96 బౌండరీలు కొడితే ఇందులో సిక్సర్లే 72 ఉన్నాయంటే వీళ్ల హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఏ లెవెల్లో ఉందో చెప్పొచ్చు. కానీ వీళ్లు హిట్టయిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ అదరగొడితే.. ఫ్లాప్ అయితే తేలిపోతోంది. తొలి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదే జరిగింది.

హెడ్‌‌‌‌‌‌‌‌ డకౌటవ్వడం, అభిషేక్‌‌‌‌‌‌‌‌ 3 రన్స్‌‌‌‌‌‌‌‌కే వెనుదిరగడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఏ దశలోనూ కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీ ఇవ్వలేకపోయింది. మరో హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌‌‌‌‌ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఓటమి తప్పలేదు. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో హెడ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌, క్లాసెన్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్, కోట్లా, వాంఖడే గ్రౌండ్లలో దంచికొట్టారు. కానీ, క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2, ఫైనల్  జరిగే చెపాక్ వికెట్‌‌‌‌‌‌‌‌ పూర్తి భిన్నంగా ఉండనుంది. స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే ఈ పిచ్‌‌‌‌‌‌‌‌పై  స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌ ఆడటం అంత ఈజీ కాబోదు. బాల్ బ్యాట్‌‌‌‌‌‌‌‌పైకి వచ్చే వరకూ బ్యాటర్లు ఓపిక పట్టాల్సి ఉంటుంది.

మరోవైపు రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్లు చహల్, అశ్విన్  జోరు మీద ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురూ ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తిగా మారింది. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్ త్రిపాఠి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం ప్లస్ పాయింట్ అయినా.. మిడిల్, లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డితో పాటు షాబాజ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, అబ్దుల్ సమద్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌తో మెప్పించాల్సిన అవసరం ఉంది. రైజర్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్ బాగానే ఉన్నా.. గత పోరులో చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోలేకపోయారు.

కమిన్స్‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్ గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాయల్స్ మాదిరిగా ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం కూడా మైనస్ కానుంది.   జైస్వాల్‌‌‌‌‌‌‌‌, శాంసన్‌‌‌‌‌‌‌‌, పరాగ్‌‌‌‌‌‌‌‌, హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పావెల్‌‌‌‌‌‌‌‌ వంటి హిట్టర్లతో కూడిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలంటే సన్ రైజర్స్ బౌలర్లు  మెరుగైన పెర్ఫామెన్స్ చేయాల్సి ఉంటుంది. 

 రాయల్స్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌లోకి..

లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో తొలుత అదరగొట్టిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓడటంతో పాటు ఆఖరి పోరు  రద్దవడంతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టింది. కానీ, ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టి మళ్లీ ట్రాక్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. గత పోరులో ఆ జట్టు అన్ని విభాగాల్లో అదరగొట్టింది.  పేసర్లు అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, ట్రెంట్ బౌల్ట్‌‌‌‌‌‌‌‌కు తోడు స్పిన్నర్లు అశ్విన్, చహల్ రాణించడంతో  ముందుగా ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో అవేశ్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా.. వరల్డ్ టాప్ పేసర్లలో ఒకడైన బౌల్ట్‌‌‌‌‌‌‌‌ తన మార్కు చూపెడుతున్నాడు.

ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 19 రన్సే ఇచ్చిన అశ్విన్‌‌‌‌‌‌‌‌ ఈ పోరులో రాయల్స్‌‌‌‌‌‌‌‌కు అత్యంత కీలకం కానున్నాడు. చిన్నప్పటి నుంచి చెపాక్‌‌‌‌‌‌‌‌లో ఆడిన అశ్విన్‌‌‌‌‌‌‌‌కు ఈ వికెట్‌‌‌‌‌‌‌‌, స్టేడియంపై పూర్తి పట్టుంది. అతనికి చహల్ తోడైతే రైజర్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక, వరుసగా మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో నిరాశపరిచిన తర్వాత ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైస్వాల్ మళ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రాగా..  బట్లర్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన కోహ్లెర్ ఆకట్టుకున్నాడు.

పరాగ్‌‌‌‌‌‌‌‌ ఫామ్ కొనసాగిస్తుండగా... కెప్టెన్ సంజు శాంసన్ తడబాటు రాయల్స్‌‌‌‌‌‌‌‌ను కాస్త కలవరపెడుతోంది. గత మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 20 రన్స్ మార్కు దాటని శాంసన్ మళ్లీ జోరందుకోవాల్సిన అవసరం ఉంది. తమ పవర్ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌తో క్షణాల్లో ఆటను మార్చేయగల హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌, పావెల్ టచ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం రాయల్స్‌‌‌‌‌‌‌‌కు ప్లస్ పాయింట్ కానుంది. ‌‌‌‌‌‌‌‌