పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు హల్చల్చేశాడు. అకారణంగా తన ఆటోను పోలీసులు అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చారని.. రహమాన్ అనే ఆటో డ్రైవర్ ఈ రోజు ( అక్టోబర్ 20) ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ఆటోను ఎందుకు తీసుకొచ్చారని పోలీసులను అడిగాడు.తరువాత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రహమాన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు.