ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే..మంత్రి పొన్నంను కలిసిన ఆటో సంఘాల జేఏసీ

ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే..మంత్రి పొన్నంను కలిసిన ఆటో సంఘాల జేఏసీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇటీవల ఆటో సంఘాల జేఏసీ నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని  తెలంగాణ ఆటో, యాప్​ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం జేఏసీ నాయకులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆటో మీటర్ ఛార్జీల పెంపు గురించి యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. కనీసం రూ.40, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.18లుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఆటోకార్మికుల సంక్షేమ బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన జరిగిన చర్చలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆటో కార్మికుల వెల్ఫేర్ బోర్డ్ విధి విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా ప్రభుత్వమే ఒక యాప్ రూపొందిస్తుందన్నారు. జీవో. 263లో గల మిగిలిన ఆటో పర్మిట్లను వెంటనే ఇస్తామని హామీ ఇచ్చారు. వెంకటేశం, సత్తిరెడ్డి ముకేష్ గౌడ్, సలీం, ప్రవీణ్, మాజీద్, అజయ్ బాబు, రాంకిషన్ మంత్రిని కలిశారు.