అప్పు చెల్లించమన్నందుకు మహిళ కడుపులో తన్నిన ఆటోడ్రైవర్

V6 Velugu Posted on Aug 07, 2021

మంగళగిరి: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోటలో నివాసముంటున్న మహిళ.. గతంలో మహానాడులో ఉండేది. ఆమె అక్కడున్నప్పుడు చిర్రావురుకు చెందిన గోపికృష్ణ అనే యువకుడికి రూ. 3 లక్షలు వడ్డీకి ఇప్పించింది. అయితే ఆ యువకుడు అప్పు తీర్చకుండా తిరుగుతండటంతో విసుగుచెందిన మహిళ.. చిర్రావురుకు వచ్చి గోపీకృష్ణను నిలదీసింది. దాంతో ఆమెను ఆటోలో ఎక్కించుకొని జనసంచారం లేని చిర్రావూరు, రామచంద్రపురం గ్రామాల మధ్య కృష్ణ కరకట్టపైకి తీసుకెళ్లి దాడి చేశాడు. కోపంతో మహిళ కడుపులో బలంగా తన్నాడు. వెంటనే ఆ మహిళ కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు.. 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడిన మహిళను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Tagged andhrapradesh, debt, auto driver, Mangalagiri, thadepalligudem

Latest Videos

Subscribe Now

More News