హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న ఆటో బంద్ విజయవంతం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. నాచారంలోని హెచ్ఎంటీ నగర్లోని సిటీ ఆఫీసులో ఆదివారం ఆటో బంద్ పోస్టర్ను విడుదల చేశారు. టీఏడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, టీయూసీఐ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు లింగం గౌడ్ పాల్గొన్నారు.

