ఇవాళ్టి నుంచి సెల్ఫ్ లాక్ డౌన్
హైదరాబాద్ బేగంబజార్లో సెల్ఫ్ లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రెండ్రోజులకే మరో మార్కెట్ అదే బాటలో నడుస్తోంది. సోమవారం నుంచి ఆటో మొబైల్ షాపులు కూడా సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఆటోమొబైల్స్ అసోసియేషన్ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల వరకే షాపులు ఓపెన్ ఉంటాయని ఆదివారం అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెప్పారు. కరోనా కేసులు పెరుగుతుండడం, రంజాన్ నెల ప్రారంభమవుతుండడంతో ఉపవాసం ఉండే వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరోవైపు ఎండాకాలం కావడంతో జనం ఎక్కువగా సాయంత్రం పూటనే మార్కెట్కు వస్తుంటారని, అందుకే సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ లోని కింగ్ కోఠి, సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని మార్కెట్లకు ప్రతిరోజు 30 వేల మంది.
