హైదరాబాద్, వెలుగు: రక్షణ, కమ్యూనికేషన్ రంగాల టెక్నాలజీ సంస్థ అవాంటెల్ లిమిటెడ్ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి రూ.137.12 కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఏడు విండ్ ప్రొఫైలర్ రాడార్ సిస్టమ్స్ సరఫరా, వారంటీ, నిర్వహణ కోసం ఈ ఒప్పందం కుదిరినట్లు సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు.
ఈ అధునాతన రాడార్ల ద్వారా దేశంలో వాతావరణ పరిశీలన, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఐఎండీ తన మౌలిక సదుపాయాలను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుందని సిద్ధార్థ చెప్పారు.
