డీమార్ట్ లాభాల జోష్.. Q3లో 18శాతం వృద్దితో రూ.856 కోట్ల లాభం

 డీమార్ట్ లాభాల జోష్.. Q3లో 18శాతం వృద్దితో రూ.856 కోట్ల లాభం

న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  కిందటేడాది అక్టోబర్–డిసెంబర్  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ3)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.856 కోట్ల   కన్సాలిడేటెడ్ నికర లాభం వచ్చింది. ఇది అంతకు ముందు ఏడాదిలోని క్యూ3లో వచ్చిన రూ.724 కోట్లతో పోలిస్తే  18.3 శాతం ఎక్కువ.  రెవెన్యూ 13.3శాతం పెరిగి రూ.18,100.88 కోట్లకు, ఖర్చులు 12.9శాతం పెరిగి రూ.16,942.62 కోట్లకు చేరాయి.  

 కంపెనీకి  స్టాండలోన్ ప్రాతిపదికన క్యూ3లో రూ.923.05 కోట్ల నెట్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వచ్చింది. ఇది ఏడాది లెక్కన 17.6 శాతం ఎక్కువ. అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 442 కి చేరింది. అమ్మకాలలో 57.19శాతం ఫుడ్ అండ్ గ్రాసరీ, 22.98శాతం జనరల్ మర్చండైజ్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పారెల్, 19.83శాతం నాన్-ఫుడ్  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ సెగ్మెంట్ల నుంచి వచ్చాయి.   మాజీ సీఈఓ నెవెల్​ నోరొన్హో పదవీ కాలం ముగియగా, కొత్త సీఈఓగా అన్షుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసవా బాధ్యతలు స్వీకరించారు.