
టీమిండియా బౌలర్ అవేశ్ ఖాన్ ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. ఆనారోగ్య కారణాల వల్ల జట్టు నుంచి అవేశ్ వైదొలిగాడు. పాకిస్థాన్తో మ్యాచ్ ఆడని అవేశ్ ఖాన్.. హాంకాంగ్ మీద పేలవ బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత జ్వరం బారినపడి సూపర్ 4 దశలో పాకిస్థాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
అందుబాటులోకి దీపక్ చాహర్..
అవేశ్ ఖాన్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ గా దీపక్ చాహర్ తుది జట్టులోకి వచ్చాడు. దీపక్ చాహర్ వెన్ను గాయంతో ఈ ఏడాది క్రికెట్ టోర్నీలకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లోనూ ఆడలేదు. జింబాబ్వే పర్యటనకు ఎంపికై రాణించాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆసియా కప్ టోర్నీకి మాత్రం స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం అవేశ్ ఖాన్ అనారోగ్యంతో దూరం కాగా.. దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు. సెప్టెంబర్ 6న ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే సూపర్ 4 మ్యాచ్‌కు చాహర్ అందుబాటులో ఉంటాడు.