అవినాష్ చేతికి వన్ ఫిన్

అవినాష్ చేతికి వన్ ఫిన్

హైదరాబాద్​, వెలుగు: అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్  ఎడ్యుటెక్ సంస్థ ఇండిగో లెర్న్/వన్​ఫిన్‌ను కొనుగోలు చేసింది. సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవినాష్  బ్రహ్మదేవర తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వేదిక ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త అంశాల్లో శిక్షణ ఇస్తారు. అవినాష్ ఆన్ లైన్ లెర్నింగ్ పేరుతో నూతన కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని అవినాష్ ​గ్రూప్​ తెలిపింది.