బీఆర్ఎస్ పాలనపై అసత్య ప్రచారాలు మానండి : వినోద్ కుమార్

బీఆర్ఎస్ పాలనపై అసత్య ప్రచారాలు మానండి : వినోద్ కుమార్
  • కాంగ్రెస్ నేతలకు రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రాజెక్టులపై లేదు
  • మాజీ ఎంపీ వినోద్ కుమార్

జమ్మికుంట, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. ప్రస్తుత ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న ధ్యాస కాళేశ్వరం ప్రాజెక్టుపై లేదని విమర్శించారు. జమ్మికుంట టౌన్ లో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఇంట్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లు గోదావరిలో కలిశాయని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శించడం సరికాదన్నారు. 

మూడు బ్యారేజీల ఖర్చు రూ. 94, 58.91 కోట్లని, కాళేశ్వరం ప్రాజెక్టు లోని మిగతా బ్యారేజ్ లకు లిఫ్టులకు టన్నెల్స్ కు కోసం ఖర్చయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోసెడు నీళ్ల గురించి ఆలోచిస్తే కేసీఆర్ బిందెడు నీళ్ల కోసం ఆలోచించి పనులు చేశారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ లో పిల్లర్లు రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 

భవిష్యత్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ఉచిత విద్యుత్ తో నడుస్తుందన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.