
న్యూఢిల్లీ: రిషబ్ పంత్‌లో ఉన్న సహజ సిద్ధమైన దూకుడు గేమ్.. నాలుగో స్థానానికి సరిపోదని లెజెండరీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఫామ్‌ను అందుకునే వరకు అతన్ని లోయర్ మిడిలార్డర్‌లో ఆడించాలని సూచించాడు. ప్రస్తుతం పంత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇదే పరిష్కారమన్నాడు. ‘రిషబ్ బ్యాటింగ్‌లో అగ్రెసివ్ షాట్స్ ఉంటాయి. దురదృష్టమేమిటంటే ఇంటర్నేషనల్ లెవల్‌లో నాలుగో స్థానంలో ఆ షాట్స్‌తో సక్సెస్ కాలేకపోతున్నాడు. అందుకే ఐదు లేదా ఆరో స్థానంలో అతన్ని ఆడించాలి.
మన ఆటను చూపించడానికి ఈ రెండు ప్లేస్‌లు చాలా అనుకూలం. నాలుగో నంబర్‌లో రన్స్ చేసే పద్ధతిని పంత్ తెలుసుకోలేకపోతున్నాడు’ అని లక్ష్మణ్ వివరించాడునాలుగో స్థానానికి అయ్యర్, హార్దిక్ చక్కగా సరిపోతారని తెలిపాడు. ధోనీ వారసుడిగా కూడా పంత్‌పై చాలా ఒత్తిడి నెలకొని ఉందని చెప్పిన వీవీఎస్.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మేనేజ్‌మెంట్ అవసరాలకు తగినట్లుగా తయారుకావాలని వెల్లడించాడు.