హైదరాబాద్, వెలుగు: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాన్ని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డికి ప్రదానం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
విశాఖపట్నంలో జరిగిన యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. తనను తీర్చిదిద్దిన సంస్థ నుంచి ఈ పురస్కారం అందుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

