గుండెపోటు లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన

గుండెపోటు లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన

నస్పూర్, వెలుగు: గుండెపోటు లక్షణాలు, వాటి నివారణ చర్యలపై సింగరేణి గని కార్మికులకు ఏరియా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోక్​నాథ్ రెడ్డి అవగాహన కల్పించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిపై గని మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుండెపోటు రాకుండా కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆత్యవసరమన్నారు. మద్యం, స్మోకింగ్​కు దూరంగా ఉండాలని సూచించారు. మాంసాహరం అతిగా తీసుకోకుండా కూరగాయలకు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కొమురయ్య, ఫీట్ ఇంజనీర్ శ్యాంకుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సునీల్ కుమార్, సర్వే ఆఫీసర్ ఎస్పీ వర్మ తదితరులు పాల్గొన్నారు.