మహిళల ఆరోగ్యంపై చైతన్యం కల్పించే లక్ష్యంతో గర్భాశయ ఫైబ్రాయిడ్స్, అధిక రుతుస్రావం, రక్తహీనత వంటి సమస్యలపై అవగాహనకు అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం రహేజా మైండ్‌స్పేస్ సమీపంలోని హోటల్ వెస్టిన్ వద్ద ‘ఫైబ్రాయిడ్ రెడ్ స్ట్రెంత్ వాక్’ నిర్వహించారు.
ఈ అవగాహన వాక్‌ను అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని జెండా ఊపి ప్రారంభించారు. రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ మహిళా ట్రైనీ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.- గండిపేట, వెలుగు
