IND vs AUS :అక్షర్‌ పటేల్ హాఫ్ సెంచరీ

IND vs  AUS :అక్షర్‌ పటేల్ హాఫ్ సెంచరీ

ఆసీస్ తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కుహ్నెమాన్ వేసిన 75 ఓవర్‌లో సిక్సర్ బాది 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.  టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిన అక్షర్‌ పటేల్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచాడు.  మరో ఎండ్ నుంచి అశ్విన్‌ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 7 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. అక్షర్‌ (52), అశ్విన్‌ (32) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇద్దరు  ఇప్పటివరకు 93 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆసీస్ నుంచి నాథన్‌ లైయన్‌ ఒక్కడే ఐదు వికెట్లు తీశాడు.