
హైదరాబాద్,వెలుగు: ఆపదలో ఉన్న పోలీస్, హోం గార్డుల కుటుంబాలకు రాష్ట్ర పోలీస్ శాఖ అండగా ఉంటుందని అడిషనల్ డీజీ (ఆర్గనైజేషన్ , హోం గార్డ్స్) స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు గంటా నరేశ్ కుమార్ (42) మృతి చెందారు. ఆయనకు యాక్సిస్ బ్యాంక్‌లో జీతం ఖాతా ఉండడంతో బ్యాంకు రూల్స్ ప్రకారం.. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కవరేజీ ఉంది.
అందుకు సంబంధించిన బీమా మొత్తం రూ.38 లక్షల చెక్కును సోమవారం డీజీపీ ఆఫీస్‌లో అడిషనల్ డీజీ స్వాతి లక్రా సమక్షంలో బ్యాంకు ప్రతినిధులు హోమ్ గార్డ్ గంటా నరేశ్ కుమార్ భార్య, నామినీ అయిన జి. నాగరాణికి అందజేశారు. బీమా మొత్తాన్ని అందజేయడంలో యాక్సిస్ బ్యాంక్ రెస్పాన్స్‌ను స్వాతి లక్రా అభినందించారు.