హైదరాబాద్, వెలుగు: నిర్మాణ రంగ నిర్వహణ ప్లాట్‌ఫామ్ పవర్ ప్లే హైదరాబాద్ మార్కెట్లోకి సాఫ్ట్‌వేర్ ఆధారిత క్రెడిట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు మెటీరియల్ కొనుగోలు కోసం లోన్లు ఇస్తున్నట్టు తెలిపింది. రూ.50 లక్షల వరకు 60 రోజుల గడువుతో ఈ సంస్థ లోన్లు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 85 వేల ప్రాజెక్టులకు సేవలందిస్తున్న పవర్ ప్లే హైదరాబాద్‌లో స్థానిక భాగస్వామ్యాల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
