అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ

అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ

భూమిపూజకు సర్వం సిద్ధం
రామ రాజ్యాన్నితలపించేలా సిటీ రోడ్లు
ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన యూపీ సర్కార్

న్యూఢిల్లీ, వెలుగు: రామ మందిర నిర్మాణంలో అద్భుత ఘట్టానికి అయోధ్య సిద్ధమవుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబై, ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఎటుచూసినా రామ రాజ్యాన్ని తలపించే అందమైన చిత్రాలు, మధుర జ్ఞాపకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కళాకృతులు భక్తుల మనసును దోచేస్తున్నాయి. శ్రీరామ పట్టాభిషేకం, వనవాసం, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు, సరియూ నదీ, దేవతా మూర్తుల చిత్రాలతో సిటీ రోడ్లు భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయి. సాయంకాలం వేళ విద్యుత్ కాంతులతో సరయూ నది వెలిగిపోతోంది. ఈ నెల 5న జరగనున్న ఆలయ భూమి పూజకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా చాలా తక్కువ మందికే ఆహ్వానం అందనున్నప్పటికీ, పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు.

దీపకాంతులతో..
సిటీని దీపకాంతుల వెలుగుల్లో నింపేందుకు రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. సోమ, మంగళవారాలు సిటీలోని అన్ని గుడులు, మఠాల్లో దీపాలు వెలిగించేందుకు లక్షల దీపాలను రెడీ చేశారు. భూమి పూజ రోజు దాదాపు లక్షా 25 వేల దీపాలను వెలిగిస్తారు. సాయంత్రం హారతి నిర్వహించేందుకు సరయూ నదీ తీరాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు.

For More News..

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

పనిచేయని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?

చుక్ చుక్.. గప్ చుప్.. రైళ్లు రాలేదు.. బొగ్గు పోలేదు