అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు

అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు
  • అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు

అయోధ్య :  యూపీలోని అయోధ్య రామమందిరంలో తొలి హోలీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. భక్తులు ఆనందోత్సాహాల మధ్య పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. రామ్ లల్లా విగ్రహానికి రంగులు, గులాల్ సమర్పించారు. రామాలయంలోని పూజారులు విగ్రహంపై పూలు చల్లారు. దేవునితో హోలీ ఆడారు. విగ్రహానికి 56 రకాల ఆహార పదార్థాలను సమర్పించారు. హోలీ వేడుకలు నిర్వహించిన తర్వాత  ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాట్లాడారు. ‘‘ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడు మొదటిసారి హోలీని ఘనంగా జరుపుకున్నాడు. రామ్ లల్లా విగ్రహాన్ని పూలు, గులాబీ రంగు దుస్తులతో అలంకరించాం. నుదుటిపై గులాల్ పూశాం” అని ఆయన తెలిపారు.