మాస్టర్ ప్లాన్ 2031.. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి

 మాస్టర్ ప్లాన్ 2031.. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి

మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా అయోధ్యను యూపీ ప్రభుత్వం  రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది.  రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు వచ్చిన వసతుల్లో లోటు రాకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టనుంది.  

1200 ఎకరాల్లో దాదాపు రూ.2,200 కోట్ల పెట్టుబడితో స్పెషల్ గా ఓ టౌన్‌షిప్‌ను కూడా నిర్మించనుంది.  ఇందుకు ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 10 ఏళ్లలో రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది.   2031 నాటికి ఏటా నాలుగు కోట్లకు పైగా పర్యాటకులు అయోధ్యను సందర్శిస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

మరోవైపు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలోనే ఉన్న  ప్రధాని మోదీ కొద్దీ సేపటి క్రితంఅయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను  జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రైలులోని ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు.  సుమారు  రూ.240 కోట్లతో మూడు అంతస్థుల్లో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.