
ఖైరతాబాద్, వెలుగు : ఆయుర్వేద స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా విఠలాపూర్‌కు చెందిన జగదీశ్(23) ఎర్రగడ్డలోని బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో బీఏఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. మధురానగర్ పరిధి జవహర్‌నగర్‌లో ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం కొండాపూర్‌లోని బంధువు రూమ్‌కు వెళ్లిన జగదీశ్ అక్కడ ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదని పోలీసులు తెలిపారు.