
శంషాబాద్, వెలుగు: మధుసూదన్, మహేశ్గురుస్వాముల ఆధ్వర్యంలో శనివారం శంషాబాద్ అయ్యప్ప దేవాలయంలో 18వ మహాపడి పూజను వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్నేత, అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు ఆర్.గణేశ్ గుప్తా, శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్బి.గోపాల్యాదవ్, స్థానిక కౌన్సిలర్లు, గురుస్వాములు పాల్గొన్నారు.