"ఆజాదీకి రైల్ గాడీ ఔర్ స్టేషన్స్" పేరిట వారోత్సవాలు

"ఆజాదీకి రైల్ గాడీ ఔర్ స్టేషన్స్" పేరిట వారోత్సవాలు

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా 'ఆజాదీ కి అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రైల్వేశాఖ "ఆజాదీకి రైల్ గాడి ఔర్ స్టేషన్స్" పేరిట వారోత్సవాలకు పిలుపునిచ్చింది.  హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ వారోత్సవాలను సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకుంటు ఓ డాక్యుమెటరీ వీడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు. 

అదే విధంగా అమరుల పేర్లతో ఉన్న రైల్వే స్టేషన్లు, రైళ్లును ప్రస్తావించారు. అమరుల త్యాగాలను స్మరించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చిందని సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట పరిస్థితులు, తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలి